అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలో స్థానిక ఎస్ఐ శేషగిరి సిబ్బందితో కలిసి పలు ప్రదేశాల్లో అక్రమ మద్యం నిర్వాహకులపై దాడులు నిర్వహించారు. నారాయణప్ప, రమేష్ నాయక్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద కర్ణాటక మద్యం పట్టుబడింది. వీరి నుంచి 213 కర్ణాటక మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి…నిందితులను రిమాండ్ కు తరలించారు.
కర్ణాటక మద్యం పట్టివేత... ఇద్దరిపై కేసు నమోదు - కర్ణాటక మద్యం పట్టివేత
అక్రమ మద్యం నిర్వాహకులపై మడకశిర పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని... ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Karnataka alcohol Seized in Madakasira