అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీ నేతాజీ యువ సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహకులు రక్తాన్ని సేకరించి అనంతపురం బ్లడ్ బ్యాంక్ కు తరలించారు. రక్తదాన శిబిరంలో యువకులు, రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కాపు రామచంద్రారెడ్డి - రక్తదానంపై కాపు రామచంద్రారెడ్డి కామెంట్స్
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రక్తదానం.. మహాదానం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
kapu ramachandrareddy on blood donation