ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది' - rayadurgam latest news

ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం పట్టణంలోని మోడల్​ స్కూల్​లో విద్యార్థుల కిట్లను పరిశీలించారు.

kapu ramachandra reddy visits rayadurgam school in ananthapur district
సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రాయదుర్గం మహిళలు

By

Published : Aug 21, 2020, 10:24 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం శాంతనగర్​లో వైఎస్సార్​ చేయూత పథకం ద్వారా లబ్ది పొందిన మహిళలు శుక్రవారం సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. వైఎస్సార్​ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ. 18,750 నగదును అందిస్తామని తెలిపారు.

అనంతరం రాయదుర్గం పట్టణంలోని మోడల్ స్కూల్​లో విద్యార్థుల కిట్లను ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి పరిశీలించారు. వచ్చే నెలలో పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాం, బూట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి కృషి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details