కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై విమర్శలు చేయడం సరికాదని కాపు, బలిజ, తెలగ గ్రేటర్ రాయలసీమ ఐకాస నాయకుడు జంగటి అమర్నాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మాట్లాడిన అమర్నాథ్ కాపు, బలిజ ,తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. కాపుల హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న వారిలో ముద్రగడ పద్మనాభమే మొదటి వరుసలో ఉన్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు స్వార్ధపరులు ముద్రగడపై విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాపు, బలిజ, తెలగ ఐకాస నాయకులు కోరారు.
రాజకీయ స్వార్ధంతోనే ముద్రగడపై ఆరోపణలు - kadiri kapu leaders meeting
ముద్రగడ పద్మనాభం కాపు పద్మనాభం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాయలసీమ ఐకాస నాయకులు కోరారు. రాజకీయ లబ్ధికోసమే ముద్రగడపై కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు.

కాపు నాయకుల సమావేశం