కశ్మీర్ లో మొదలై.. కన్యాకుమారి వరకూ జరుగుతున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ... అనంతపురం జిల్లా పెనుకొండకు చేరుకుంది. 370 అధికరణ రద్దును సమర్థిస్తూఈ ర్యాలీని 5 వేల 200 కిలోమీటర్ల మేర చేపట్టారు. 21మంది బృందంతో కూడిన ఈ ర్యాలీ పెనుకొండ చేరుకోగా.. స్థానిక భాజపా నాయకులు స్వాగతం పలికారు. జాతీయ రహదారి 44 కూడలిలోని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీగా వచ్చిన వారిని అభినందించారు.
పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ - తిరంగయాత్ర
మోదీ ప్రభుత్వం తీసుకున్న 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు పలువురు తిరంగ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీ అనంతపురం జిల్లాకు చేరుకుంది. స్థానిక భాజపా నాయకులు యాత్రకు స్వాగతం పలికారు.
పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ