అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సర్వేయర్ హేమ సుందర్ ఓ మహిళా రైతు నుంచి 1.4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ఎన్.జయమ్మ అనే మహిళ రైతు నుంచి కళ్యాణదుర్గం మండలంలో నలభై సెంట్లు భూమి కొలతలు చేయడానికి రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. సమాచారం అందుకున్న కర్నూలు రేంజ్ డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి... మహిళ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన సర్వేయర్ - కళ్యాణదుర్గం మండలం సర్వేయర్‌ను పట్టుకున్న అనిశా అధికారులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సర్వేయర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ రైతు నుంచి 1.4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. భూమి కొలతలు వేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
surveyor arrested
TAGGED:
అనిశాకు చిక్కిన సర్వేయర్