అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. నెహ్రూ ఐక్య వేదిక సంఘం లీడర్ షకిరా భాను 24 గ్రూపుల పొదుపు డబ్బులను వాడుకుందని మిగతా గ్రూప్ సభ్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి రూ. 7,45,000 తన సొంత ఖాతాలో వేసుకుని... ఆమె సన్నిహితులకు మాత్రమే గ్రూపులో డబ్బులు పంచుతుందని మహిళలు ఆరోపించారు. దీంతో ఈరోజు కళ్యాణదుర్గం మారంపల్లి కాలనీలో ఉన్న బీసీ హాస్టల్లో ఆందోళనకు దిగారు. వాదోపవాదాలు జరిగాయి. గ్రూప్ సభ్యులంతా కలిసి అధికారుల దగ్గరికి బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి చెల్లింపు వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 7 లక్షల రూపాయలు చెల్లింపులు జరిగాయని అధికారులు తెలిపారు. షకీరా మాత్రం కేవలం మూడు లక్షలే తన వద్ద ఉన్నాయని చెప్పినందున గ్రూపు సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్వాక్రా సొమ్ము స్వాహా చేశారని మహిళల ఆందోళన - డ్వాక్రా సొమ్మును స్వహా చేశారని కళ్యాణదుర్గం మహిళల ఆందోళన
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డ్వాక్రా సంఘం లీడర్ షకిరా భాను తమ డబ్బులు వాడుకుందంటూ ఆ సంఘంలోని కొందరు మహిళలు ఆరోపించారు.
డ్వాక్రా సొమ్మును స్వహా చేశారని కళ్యాణదుర్గం మహిళల ధర్నా
Last Updated : Oct 19, 2019, 7:30 AM IST