అనంతపురం జిల్లాలో లభిస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటుందని తెలుగుదేశం నేతలు అనంతపురంలో ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ అర్థం కాని పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని.. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వ పెద్దలు వెటకారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ నెల 12న భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ వ్యాపార సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు నేతలు తెలిపారు. అనంతరం 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసన దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు వివరించారు.
'చంద్రబాబు నిరసనకు సంఘీభావంగా తెదేపా శ్రేణుల దీక్షలు' - kalyana durgam tdp latest press meet
పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కళ్యాణదుర్గం తెదేపా నేతలు ఆరోపించారు. ఈనెల 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసనకు సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు నేతల తెలిపారు.
'పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం'
ఇవీ చూడండి-మనసు పడింది... ఆపై ఆమెపై దాడి చేసింది!