kalava srinivasulu criticized the government : అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్ వద్ద తుంగభద్ర ఎగువ కాలువ కుడి గట్టుకు గండిపడి. నీరంతా వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గండి ప్రదేశాన్నిహెచ్ఎల్సీ ఆయకట్టు రైతులతో కలిసి పరిశీలించారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు లేఖలు రాసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు అని విమర్శించారు.
Neglecting the repair work for Tungabhadra canal : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన.. హెచ్ఎల్సీకి ఆధునీకీకరణ పనులు పూర్తి చేయకపోవటం వల్ల ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట కాలువకు గండి పడి నీరంతా వృధా అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బొమ్మనహల్ మండలం ఉంతకల్ వద్ద గండిపడి నీరంతా వృధాగా బయటకు పోతున్నాయి. నీరు వృధా పోతున్న నాయకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తాగు, సాగునీటి పైన శ్రద్ధ లేదన్నారు. హెచ్ఎల్సీ మరమ్మతుల కోసం పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ కు పలుమార్లు లేఖలు రాశామన్నారు. ఇలాంటి ఆత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం 20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు. ఇప్పుడు ఎగువ కాలువకు గండి పడి నీరంతా వృథా అవుతున్నాయని అన్నారు.