ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Arrest: సవాల్ చేసి, పోలీసులను పంపాడు.. ప్రభుత్వ విప్ కాపుపై కాలువ ఫైర్..

By

Published : Apr 20, 2023, 7:32 PM IST

Updated : Apr 20, 2023, 7:41 PM IST

Kaluva Srinivasulu: అనంతలో అధికార విపక్షాల సవాళ్ల పర్వం.. ప్రతిపక్ష టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అరెస్టుకు దారి తీసింది. జిల్లాలోని రాయదుర్గం అభివృద్దిపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అయితే, చర్చాకు బయలు దేరిన కాల్వ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. అటు అనంతలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా సెల్పీ చాలెంజ్ తో వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

Kaluva Srinivasulu
కాల్వ శ్రీనివాసులు

Kapu Ramachandra Reddy: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గడపగడపకు వెళ్తూ ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం హనుమాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అంశాన్ని ఖండించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా అసమర్థ పాలనతో అసమర్థ ఎమ్మెల్యేగా కాపు ఉన్నాడన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా.. ఎమ్మెల్యే బెదిరింపులతో పాలన సాగించాలని చూస్తున్నారన్నారు. గతంలో రైతులకు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ రాయితీలతో పరికరాలు అందించామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదని, పైగా బెదిరించి ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని కాల్వ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును కళ్యాణదుర్గం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఇరువర్గాల సవాళ్ల నేపథ్యంలో కాల శ్రీనివాసులను అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో ఉంచారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ తీసుకువస్తున్నారనే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా స్టేషన్ ఆవరణానికి చేరుకున్నారు. పోలీస్​లు కాలవ శ్రీనివాసులును స్టేషన్లోకి వెళ్తున్న సమయంలో తీవ్ర తోపులాట, వాగ్వాదాలు చోటుచేసుకుంది

రాయదుర్గం గత కొంతకాలంగా అభివృద్ధి పనులపై ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజాగా కనేకల్ మండలం ఎన్ హనుమాపురం అభివృద్ధిపై రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు. అభివృద్ధిపై ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు హనుమాపురం గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హనుమాపురం గ్రామానికి చేరుకున్న కాలువ శ్రీనివాసులు తాను కాపు రామచంద్రారెడ్డి కోసం వేచి ఉన్నానని ప్రకటించారు. ఆయన రాలేదని, ఆయన తప్పించుకుని పోలీసుల్ని పంపారని కాల్వ శ్రీనివాసులు హేళనగా మాట్లాడారు. కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉంటాయని కాలువ విమర్శించారు. కాపు రామచంద్రారెడ్డి ఓ దొంగ అయితే, జగన్మోహన్ రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తున్నారని కాలవ శ్రీనివాసులు తీవ్రప్రజాలంతో ఆరోపణలు చేశారు. మరోసారి ఇటువంటి చెత్త సవాళ్లు చేస్తే నోటితో సమాధానం చెప్పమని, తమ పార్టీ కార్యకర్తలు వేరే విధంగా సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారని కాలువ స్పష్టం చేశారు.

సెల్ఫీ ఛాలెంజ్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్ భవనం ముందు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సెల్ఫీ దిగి ప్రస్తుత ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇటువంటి భవనాలు నిర్మించి పేదలకు తక్కువ ధరకు కడుపునిండా భోజనం పెట్టే కార్యక్రమం చేపట్టామని గుర్తుకుచేశారు. ఇలాంటి భవనాలు ఎన్నో నిర్మించామని వెల్లడించారు. ఇలాంటి బృహత్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారని ఆరోపించారు. అయితే, కళ్యాణదుర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి సంవత్సర కాలంగా ఆర్డిటి ఆసుపత్రి ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచితంగా భోజన, వసతి కల్పిస్తూ ఆదుకుంటున్నారని పల్లె ప్రశంసించారు.

కాపు రామచంద్రారెడ్డి, కాలవ శ్రీనివాసులు మధ్య సవాళ్లపర్వం

ఇవీ చదవండి:

Last Updated : Apr 20, 2023, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details