అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని కల్లు దుకాణాదారులతో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ నెల 4 నుంచి కల్లు విక్రయించుకోవచ్చని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి విక్రయించుకోవచ్చని సూచించారు.
ఈ నెల 4 నుంచి కల్లు విక్రయాలు..! - corona cases in ananthapuram\
కొవిడ్-19 కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించటంతో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. కల్లు విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 4 నుంచి తిరిగి కల్లు విక్రయాలు కొనసాగించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Kallu sales