అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా మోసం చేసిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'బాదుడే బాదుడు' కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన వస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రేపు (గురువారం) రాత్రి అనంతపురం-కర్నూలు జిల్లాల సరిహద్దు కరిడికొండలో చంద్రబాబుకు స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వంచనకు గురైన ప్రజలందరూ ఈ పర్యటనలో పాలుపంచుకోవాలని జిల్లా ప్రజలకు కాలవ పిలుపునిచ్చారు.
వారందరూ చంద్రబాబు పర్యటనలో పాల్గొనాలి: మాజీ మంత్రి కాలవ
ప్రభుత్వ వంచనకు గురైన ప్రజలందరూ అనంతపురం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్న 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా మోసం చేసిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన పర్యటనకు విశేష స్పందన వస్తోందని అన్నారు.
మాజీ మంత్రి కాలవ
వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని.., శ్రీలంక ప్రధాని తరహాలో జగన్ రెడ్డికి బంకర్లు కూడా లేవని తెదేపా నేత బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైనందునే.. వందల మంది పోలీసులు లేకుండా వెలుపలికి రాలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి బంగ్లాకే పరిమితమయ్యారన్నారు.
ఇవీ చూడండి