ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శనగ పంటను పరిశీలించిన మాజీ మంత్రి - ఈ క్రాప్‌ చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక

Kalava Srinivasulu inspected Bengal Gram Crop: అనంతపురం జిల్లాలో వర్షాభావంతో శనగ పంట దెబ్బతిన్నా.. ఈ క్రాప్‌ బుకింగ్‌ చేయలేదని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం మాల్యంలో ఎండిపోతున్న పంటను పరిశీలించిన ఆయన.. అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వారంలోపు ఈ క్రాప్ బుకింగ్ చేయకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Kalava_Srinivasulu_Inspected_Bengal_Gram_Crop
Kalava_Srinivasulu_Inspected_Bengal_Gram_Crop

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 12:18 PM IST

Kalava Srinivasulu Inspected Bengal Gram Crop :అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పంటలు దెబ్బతిని అప్పులపాలైన రైతులకు రబీ సేద్యం కూడా చేదు అనుభవాన్నే మిగిల్చిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం మాల్యం గ్రామంలో టీడీపీ నాయకులు, రైతులతో కలిసి ఎండిపోతున్న పప్పుశనగ పంట పంటను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు.

శనగ పంటను పరిశీలించిన మాజీ మంత్రి - ఈ క్రాప్‌ చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక

Kalava Warning To Officials About E Crop Booking :ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంట దిగుబడులు లేక పెట్టుబడులు రాక తీవ్ర ఆందోళన మధ్య సగటు రైతు జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. మాల్యం గ్రామానికి చెందిన శివ రాజు అనే రైతు తనకున్న 17 ఎకరాల్లో పప్పుశనగ పంట పెట్టి, తీవ్రంగా నష్ట పోయానని కాలవ శ్రీనివాసులుతో తన బాధను వ్యక్తం చేశాడు. తాను పెట్టిన పంట వివరాలను ప్రభుత్వ అధికారులు ఇంతవరకు రికార్డు కూడా చేయలేదని తెలిపారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు పెట్టాడో ప్రభుత్వ అధికారులు నమోదు చేయకపోతే నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఎలా అందుతుందని ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని కాలవ సూటిగా ప్రశ్నించారు.

మాయదారి రోగం - లబోదిబోమంటున్న మిర్చి రైతులు

Bengal Gram Crop Farmers Problems in Anantapur District :గతంలో టీడీపీ ప్రభుత్వం పంట నష్టపోతే తనకు 2.50 లక్షల రూపాయలు పంటల భీమా పరిహారం అందించామని కాలవ శ్రీనివాసులు గుర్తు చేశారు. నాలుగేళ్లలో మూడు సార్లు అకాల వర్షాలతో పంటలు నష్టపోయారని కాలవ పేర్కొన్నారు. శెనగ పంట ఇ-క్రాప్ బుకింగ్ ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదని వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు.

స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ప్రభుత్వం మొండి వైఖరి - రైతులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా కనెక్షన్లు

తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన : రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎండిపోయిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో ఎందుకు పరిశీలన చేయడం లేదో చెప్పాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కనీసం రైతులు ఎటువంటి పంటలు పెట్టారో కూడా ఎమ్మెల్యేకి అవగాహన లేకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. వారంలోపు ఈ క్రాప్ బుకింగ్ ప్రారంభించకపోతే తాను రైతులందర్ని సమీకరణ చేసి కనేకల్లు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తామని కాలవ హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం : కనేకల్లు మండలంలోనే సుమారు 14 వేల ఎకరాల్లో దెబ్బ తిన్న పప్పుశెనగ రైతులకు ప్రభుత్వంభరోసా కల్పించడానికి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 వేల ఎకరాల పైచిలుకు పంటలకు నష్టం జరిగినా, ప్రభుత్వం ఎందుకు మెలుకోవడం లేదని కాలవ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కనేకల్ మండల కన్వీనర్ లాలేప్ప, సర్పంచ్ జయరాం చౌదరి, ఎంపీటిసి నరేంద్ర చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

వరి రైతుల కష్టం వర్షార్పణం - ప్రభుత్వం నిబంధనలు సడలించి ఆదుకోవాలని వేడుకోలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details