ప్రజలు స్వేచ్ఛగా, ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓట్లు వేయాలని... తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయదుర్గంలో రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలను ప్రశ్నించకపోతే.. రాయదర్గంలో ప్రజలకు రక్షణ ఉండదని అన్నారు.
'ప్రజలకు అండగా ఉండేవారికి మద్దతివ్వండి'
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై... తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారికి, ప్రజలకు అండగా ఉండేవారికి.. ఓట్లు వేయాలని కాలవ శ్రీనివాసులు సూచించారు ప్రజలు స్వేచ్ఛగా, ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు. ప్రజల అభిమానాన్ని పొంది పార్టీ సానుభూతిపరులను గెలిపించుకోవటం మాని.. తనపైన, ఎన్నికల కమిషనర్‌పైన కాపు రామచంద్రారెడ్డి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. బొమ్మక్కపల్లి ఈరన్న విషయంలో తనకు సంబంధం లేకపోయినా.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చండి: ఎస్ఈసీ