రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్లో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
ప్రతిపక్షంపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికారాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగించకుండా ప్రతిపక్ష గళం నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.