రాష్ట్రంలో నరహంతకుల పాలన సాగుతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులుగా ఉండే వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకొని వైకాపా ప్రభుత్వం యథేచ్ఛగా హత్యా రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 18 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం 15 మంది తెదేపా నాయకులను హతమార్చిందన్నారు. ఇందులో 11 మంది బీసీ నాయకులు ఉండటం, బీసీల పట్ల వైకాపాకు ఉన్న కసి, కక్ష్యకు నిదర్శనమన్నారు.
నందం సుబ్బయ్య హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో తెదేపా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీసీల హక్కులను కాపాడటానికి రాజీలేని పోరాటం సాగిస్తోందన్నారు.