తెలుగుదేశం పార్టీతోనే పట్టణ అభివృద్ధి సాధ్యపడుతుందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం 13వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమ వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు, పాల్గొన్నారు.
తెదేపాతోనే పట్టణ అభివృద్ధి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు - తెదేపా న్యూస్ అప్డేట్స్
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెదేపా అభ్యర్థి తరపున జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.
Kalava On Canvas