జగన్ ప్రతీకార చర్యలకు ఉదాహరణే అచ్చెన్నాయుడు అరెస్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. విచారణకు సంబంధించి ఎలాంటి నోటీసు లేకుండా వందలాది మందితో ఉదయాన్నే వెళ్లి బలవంతంగా తీసుకెళ్లటాన్ని కిడ్నాప్ కాక ఏమంటారని కాల్వ నిలదీశారు. ఎదిగే నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నమేనని దుయ్యబట్టారు.
ఎదిగే నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం - news on acchennaidu arrest
అచ్చెన్నాయుడు అరెస్టు ఎదిగే నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నమేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. విచారించకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడు అరెస్టు పై కాల్వ శ్రీనివాసులు