వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోందని... అనంతపురం జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. కదరి మద్యం దుకాణం వద్ద తెదేపా నేతలు నిరసన తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నా ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని శ్రమిస్తున్న పోలీసులు, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య శాఖ అధికారుల కష్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మద్యం దూకాణాలు తెరిచి ప్రజలు కరోనా బాధితుల మారటానికి కారణమవుతోందని తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.
'ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి... ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నారు'
ప్రభుత్వం తీరుపై అనంతపురం జిల్లా తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. మద్యం షాపులు తెరిచి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో మద్యం దుకాణాలు తెరవటం వలనే కరోనా బాధితులు ఎక్కువవుతున్నారని ఆరోపించారు.
తెదేపా నేతల ఆందోళన