ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట తెదేపా నేతల నిరసన - కదిరి తెదేపా నేతల నిరసన న్యూస్

కరోనా వైరస్ నివారణ లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా కదిరి తెలుగుదేశం నాయకులు అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

kadiri tdp leaders agitation
కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట తెదేపా నేతల నిరసన

By

Published : Jul 25, 2020, 10:55 PM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అనంతపురం జిల్లా కదిరి తెదేపా నేతలు ఆరోపించారు. కొవిడ్​ను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమయ్యిందనీ.. దీనికి నిరసనగా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఒక వైపు కరోనాతో మరో వైపు ఆర్థిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మరింత ఉగ్రరూపం దాల్చకముందే... మరిన్ని కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు. క్వారంటైన్​ సెంటర్​లలో వసతి, భోజన సదుపాయలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details