ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యపై భర్త ఘాతుకం ఘటనలో ఇద్దరు అరెస్టు - కదిరి క్రైమ్ న్యూస్

కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే... భార్యపై అమానుషానికి ఒడిగట్టాడు. స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త అకృత్యాలు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. కూతురు పరిస్థితిని గమనించిన తల్లి.. ఆరా తీయగా అసలు సంగతి తెలిసింది.

kadiri rape case accused arrested in just 6 hours
భార్యపై భర్త ఘాతుకం.. స్నేహితుడితో కలిసి అత్యాచారం

By

Published : Dec 4, 2019, 6:15 PM IST

భార్యపై భర్త ఘాతుకం.. స్నేహితుడితో కలిసి అత్యాచారం
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై కట్టుకున్న భర్తే కర్కశానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత క్రూరంగా మంచానికి కట్టి చిత్రహింసలు పెట్టాడు. భర్త అకృత్యాలు భరించలేక బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. కుమార్తె పరిస్థితిని గమనించిన తల్లి జరిగిన విషయం తెలుసుకుంది. ఆమెను కదిరి ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బాధితురాలి బంధువులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... ప్రత్యేక బృందాలతో నిందితులను ఆరు గంటల్లోనే పట్టుకున్నామని కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details