కదిరిలో కలకలం - VEHICLE CHECKING
అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనపరుచుకున్నారు.

సంచిలో లభించిన పేలుడు పదార్థాలు
అనంతపురం జిల్లా కదిరిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సోదాలు పసిగట్టిన కొందరు వ్యక్తులు.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఉన్న సంచిని తమ వాహనం నుంచి బయట పడేశారు. ఇది గమనించిన పోలీసులు.. దుండగులను వెంబడించి ఐదుగురిని అరెస్టు చేశారు. సంచిలో ఉన్న64 జిలెటిన్ స్టిక్స్, 49 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల స్వాధీనంలోని జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు
Last Updated : Feb 20, 2019, 10:54 AM IST