ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 7, 2021, 4:38 PM IST

ETV Bharat / state

కొలతల పేరుతో కాలయాపన చేస్తున్నారని.. కదిరిలో రాస్తారోకో

కదిరి - హిందూపురం రోడ్డు విస్తరణ కొలతల్లో మార్కింగ్​ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారటూ.. కదిరిలో ఇళ్ల యజమానుల సంఘం రాస్తారోకో చేపట్టింది. కొలతల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని.. స్థలం కోల్పోతున్నవారికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

protest at kadiri
కదిరి యజమానుల సంఘం రాస్తారోకోc

రహదారి విస్తరణ విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఇళ్ల యజమానుల సంఘం రాస్తారోకో చేపట్టింది. కదిరి పట్టణంలోని హిందూపురం రహదారిని విస్తరిస్తున్నామంటూ ఆరు నెలలుగా అధికారులు మార్కింగ్​ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఇబ్బందులు కలిగించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. కొలతల పేరుతో కాలయాపన చేస్తూ.. స్థలం కోల్పోతున్నవారికి పరిహారం చెల్లించాలని రాయలసీమ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details