అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైష్ణవి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఉయ్యాలోత్సవ సేవ నిర్వహించారు. ప్రహ్లాద సమేత స్వయంభూగా వెలసిన స్వామివారిని మల్లె, తులసి సుగంధ పరిమాలతో అలకరించి.. రంగమండపంలో ఉయ్యాలోత్సవ పీఠంపై అధిష్టించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి కారణంగా తక్కువ మంది భక్తుల సమక్షంలోనే స్వామి వారికి ఉంజల్ సేవ నిర్వహించారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాలోత్సవం - కదిరి నరసింహ స్వామి ఉయ్యాలోత్సవం న్యూస్
అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాలోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. కొద్దిమంది భక్తులు మాత్రమే పూజల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాలోత్సవం