ధైర్యంగా ఉంటే కరోనా వైరస్ బారి నుంచి బయటపడవచ్చని అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బాధితులకు వైద్య సేవలు అందించేందుకు పట్టణములోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. 250 పడకలతో బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనావైరస్ నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సిద్దారెడ్డి అన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే - అనంతపురంలో కరోనా వార్తలు
అనంతపురంలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ధైర్యంగా ఉండటంతో కరోనా నుంచి బయటపడ వచ్చన్నారు. 250 పడకలతో కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
kadiri mla started covid care cetner in anantapur dst