కోవిడ్ సోకిన వారు అధైర్య పడవద్దని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి తెలిపారు. కదిరిలోని కొవిడ్ కేర్ సెంటర్లోని పాజిటివ్ బాధితులకు ఆయన వైద్య సేవలు అందించారు. ధ్యైర్యంగా ఉంటే ప్రతిఒక్కరూ కరోనా వైరస్ను జయించొచ్చన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లతో పాటు కొవిడ్ ఆసుపత్రుల్లో పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేర్ సెంటర్ లోని బాధితులందరిని పలకరించి ధైర్యం చెప్పారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులను వైద్యపరమైన సలహాలు, సూచనలు అందించారు. 60ఏళ్లు దాటినవారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ కరోనా సోకినవారికి కొవిడ్ వైద్యశాలలో... ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.