ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోహిని అవతారంలో కదిరి లక్ష్మీనరసింహ స్వామి - కదిరి

అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చారు. ఇందుకు ప్రతీకగానే ఉత్సవం నిర్వహిస్తారు.

మోహిని అవతారంలో కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చారు.

By

Published : Mar 24, 2019, 9:01 AM IST

మోహిని అవతారంలో కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చారు.
అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను రకరకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారిని పల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. ధర్మపరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారం దాల్చారని ఇందుకు ప్రతీకగానే ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details