అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామి వారు చంద్రప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రునిపై శ్రీ, భూ సతులతో ధవళవర్ణ కాంతులీనుతున్న స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన జనం ఆనందంతో పరవశించారు. నవగ్రహాల్లో అధిష్టాన స్థానం చంద్రుడిది. అలాంటి చంద్రవాహనంపై ఖాద్రీశుడు దేవేరులతో ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగర మధనంలో శ్రీమహాలక్ష్మీకి తోబుట్టువుగా జన్మించిన వారు చంద్రుడు. శుక్లపక్ష చంద్రుడిపై ధవళవర్ణ పుష్పాలతో అలంకృతుడై స్వామి దర్శనమివ్వటం విశేషం.
కలువల రేడు.. చల్లని ఖాద్రీశుడు - కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
అనంతపురం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామి వారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన జనం ఆనందంతో పరవశించారు.
![కలువల రేడు.. చల్లని ఖాద్రీశుడు kadiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11207914-451-11207914-1617074400556.jpg)
కదిరి, లక్ష్మీ నరసింహస్వామి