ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా గంగమ్మ బోనాలు.. మొక్కులు చెల్లించిన భక్తులు - Erradoddi Gangamma Bonalu in Kadiri Kutagulla

మేళతాళాల నడుమ గ్రామ దేవత ఎర్రదొడ్డి గంగమ్మ బోనాలు సమర్పించారు కదిరి మండలం కుటాగుళ్ల గ్రామస్థులు. ఊరంతా ఏకమై అమ్మవారి మెుక్కులు సమర్పించి.. విందు భోజనాలు ఆరగించారు.

Erradoddi Gangamma Bonalu
కదిరి కుటాగుళ్ల గ్రామ దేవత ఎర్రదొడ్డి గంగమ్మ బోనాలు

By

Published : Jan 24, 2021, 1:12 PM IST

కదిరి కుటాగుళ్ల గ్రామ దేవత ఎర్రదొడ్డి గంగమ్మ బోనాలు

అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్లలో.. గ్రామ దేవత ఎర్రదొడ్డి గంగమ్మ బోనాలు వేడుకగా జరిగాయి. సంక్రాంతి పర్వదినం ముగిశాక వచ్చే రెండో ఆదివారం గ్రామం మొత్తం ఊరేగింపుగా వెళ్లి గంగమ్మకు మొక్కులు సమర్పించటం ఆనవాయితీ. ఉదయం గ్రామస్తులందరూ.. కుటాగుళ్లలోని వాల్మీకి విగ్రహం ఎదుట ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఎర్రదొడ్డి గంగమ్మ కాలినడకన బోనాలతో బయలుదేరారు. రోజంతా గంగమ్మ వద్దనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడుపుతారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం విందు భోజనాలు ఆరగించి గ్రామానికి బయలుదేరుతారు.

ABOUT THE AUTHOR

...view details