అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ గరుడ ఆంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. కదిరి సమీపంలోని మధ్య లేరు వాగు పక్కనున్న గరుడ ఆంజనేయస్వామి ఆలయం పరిసర భూముల ఆక్రమణలతో గురయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉన్న ఈ ఆలయం ఆక్రమణలతో కుచించుకుపోయింది.
కదిరి గరుడ ఆంజనేయునికి పూర్వవైభవం - గరుడ ఆంజనేయస్వామి
శిథిలావస్థకు చేరుకున్న ఆలయం, పాడుబడిపోయిన కోనేరు...ఇదీ కొన్ని రోజుల క్రితం కదిరి గరుడ ఆంజనేయస్వామి ఆలయం పరిస్థితి. ఆలయ పరిస్థితి తెలుసుకున్న కొందరు యువకులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. శిథిలావస్థలోని ఆలయానికి పూర్వశోభను తెచ్చారు.
గుడి పరిస్థితిని తెలుసుకున్న శ్రీ ఖాద్రీ రక్షక దళ్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. యువకుల చొరవతో ఆలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గుడి మొత్తం రంగులు వేయించి, ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా కాషాయ ధ్వజాలను ఏర్పాటు చేశారు. మంగళ, శనివారాలు అంజనీపుత్రుడికు పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గుడి పునరుద్ధరణతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగిందని స్థానికులు అంటున్నారు. యువకుల చొరవను అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి :నవరత్నాలను అమలు చేస్తాం: సీఎం జగన్