ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుడ వాహనంపై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి - కదిరి నరసింహ స్వామిపై వార్తలు

అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గరుడ వాహనంపై విహరించారు. ఉత్సవమూర్తులను అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. చెక్కభజన, కోలాటం, భజన మండలి సభ్యుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

kadhiri narasimha swamy on garuda vahan
గురుడ వాహనంపై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి

By

Published : Mar 14, 2020, 11:37 AM IST

గురుడ వాహనంపై విహరించిన కదిరి లక్ష్మీనరసింహస్వామి

అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రజా గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. పదో రోజు నారసింహుడు గరుడ వాహనంపై విహరించారు. ఆళ్వారుల చేత ప్రజలు నిర్వహించే ఈ ఉత్సవాన్ని ప్రజా గరుడ సేవగా పిలుస్తారు. శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేక పల్లకిలో కొలువు తీర్చి రాజగోపురం ముందుకు తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారు గరుత్మంతుడు వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలో చెక్కభజన, కోలాటం, భజన మండలి సభ్యుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details