అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలోని కడ్లే గౌరమ్మ ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిలో గౌరీదేవిని ప్రతిష్ఠించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, మెుక్కులు చెల్లించుకున్నారు.
మూడు రోజులుగా విశేష పూజలు అందుకున్న గౌరీదేవి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున ఊరేగించి నిమజ్జనం చేయనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల నుంచే కాకుండా అనంతపురం, బళ్లారి నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.