అనంతపురంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం గ్రామీణ పరిధిలోని నారాయణపురంలో వైకాపా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేశారు. కబడ్డీ, రాతిదూలం పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేయనున్నారు.
సంక్రాంతి సంబరాలు.. అనంతపురంలో వైకాపా ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు - అనంతపురం తాజావార్తలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైకాపా ఆధ్వర్యంలో అనంతపురం పరిధిలోని నారాయణపురంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పోటీలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నారాయణపురంలో ఇవాళ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జట్లు పాల్గొన్నాయి. మొత్తం 4 మహిళా జట్లు పాల్గొనగా.. బాలుర జట్లు 30 పోటీలో నిలిచాయి. మహిళా జట్ల కబడ్డీ పోటీలు ఆసక్తిగా సాగుతున్నాయి. క్రీడాకారులు పోటాపోటీగా ఆటలో తమ ప్రతిభను చాటుతున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాటలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. రేపు నిర్వహించే రాతిదూలం ఆట అనంతరం.. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: అనంతపురంలో అట్టహాసంగా భోగి వేడుకలు