ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KA Paul: మేము అధికారంలోకి వస్తే.. మహిళ సీఎం: కేఏ పాల్​ - కేేఏ పాల్​

KA PAUL: ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశంతో జగన్​ అధికారంలోకి వచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ ఆరోపించారు. ఈసారి జగన్​కు ఓట్లు పడే అవకాశం లేదని.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.

KA PAUL
KA PAUL

By

Published : Aug 4, 2022, 10:31 PM IST

Lady CM to AP: ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక జగన్ ఫెయిల్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్​కి ప్రజలు అధికారమిచ్చారని అనంతపురంలో ఆయన గుర్తు చేశారు. అప్పులు దొరక్క జగన్ పాలన సరిగా చేయడం లేదని ఆరోపించారు. ఈసారి జగన్​కు ఓట్లు పడే అవకాశం లేదని.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావన్నారు.

Prajashanti Party: ఏపీలో భాజపాకు ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇస్తే.. లక్ష కోట్ల రూపాయలు తెస్తానన్నారు. పవన్ కల్యాణ్ పులిలాంటి తనతో కలిసి రావాలని కోరారు. ఏపీలో వైకాపా నాయకులే తమకు సపోర్ట్ ఇస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఏపీలో ఒక్క మహిళా సీఎం కాలేదని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళను సీఎం చేస్తానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ని చూసి జగన్ పరిపాలన సాగిస్తున్నాడని విమర్శించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details