గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు భూములను చూపించాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో జర్నలిస్టులు నిరాహారదీక్ష చేపట్టారు. సామాన్య ప్రజలకు ఇంటి స్థలాలు మంజూరు చేసిన ప్రభుత్వం..జర్నలిస్టుల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమకు రావాల్సిన స్థలం కోర్టులో పెండింగులో ఉందంటూ కాలం వెళ్లదిస్తున్నారని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు స్థలాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పట్టా భూముల కోసం జర్నలిస్టుల ఆమరణ నిరాహార దీక్ష - Journalists on hunger strike in Uravakonda
గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమకు ఇవ్వాల్సిన స్థలం కోర్టులో ఉందంటూ.. అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.

జర్నలిస్టుల ఆమరణ నిరాహార దీక్ష