జేఎన్‌టీయూలో ఉత్సాహంగా యువజనోత్సవాలు - jntu youth fest news in telugu at ananthapuram
అనంతపురంలోని జేఎన్‌టీయూ వేదికగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్నీ యూనివర్సిటీల విద్యార్థులు పాల్గొన్నారు. నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పోటాపోటీగా నృత్యం చేస్తుంటే... ఈలలతో ఆడిటోరియం మార్మోగింది.