జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్ ఈ నెల 30న జరగనున్న ఏపీ సెట్లో కొన్ని మార్పులు చేశామని.. అభ్యర్థులు గమనించి సహకరించాలని అనంతపురం జిల్లా జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్ కోరారు. ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను జేఎన్టీయూలో భద్రపరచటం వల్ల 1100మంది విద్యార్థులను హైదరాబాద్లోని సెంటర్లకు మార్చామన్నారు. పరీక్షకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని..చరవాణి, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. మహిళలు చేతులకు మెహందీ వంటి రంగులు ఉండకూడదని తెలిపారు. సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల బస్సు చార్జీల అంశంపై సంబంధిత బోర్డు సభ్యులతో మాట్లాడి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి చూడండి...