కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య రంగ జనార్దన చెప్పారు. ఈసెట్ సంబంధించి పరీక్ష తేదీలను వీసీ రంగ జనార్దన విడుదల చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ 48 సెంటర్లలో ఆన్ లైన్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఆగస్టు 12వ తేదీ వరకు సాధారణ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో దరఖాస్తు సమర్పణకు ఆగస్టు 23వ తేదీ తుది గడువుగా నిర్ణయించామన్నారు.
ECET: సెప్టెంబర్ 19న ఈసెట్: జేఎన్టీయూ వీసీ - latest news of ap ecet
సెపెంబర్ 19న ఈసెట్(ECET) పరీక్ష నిర్వహించనున్నట్లు అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య రంగ జనార్ధన తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 48 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
jntu vc on ecet
ఈ ఏడాది ఇప్పటి వరకు 20 వేల దరఖాస్తులు వచ్చాయని, గడువులోపు 40వేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇందుకు తగినట్లుగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని, భౌతిక దూరం పాటిస్తూ ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. అక్టోబర్ ఒకటో తేదీన ఈసెట్ ఫలితాలు, ఐదో తేదీన ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి:Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు