ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు - recent news in kadiri

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 190వ జయంతి వేడుకల సందర్భంగా... అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

By

Published : Nov 20, 2019, 12:07 AM IST

గుంతకల్లులో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 190వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో తలకు తలపాగా తగిలించుకొని... ప్రతీ మహిళ ర్యాలీలో పాల్గొన్నారు. గుర్రంపై ఝాన్సీ లక్ష్మీబాయి అలంకరణతో ఉన్న మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి సత్యవేణి హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి నుంచి బయటపడే మార్గాలను ఉదాహరణలతో ఆమె మహిళలకు వివరించారు. విద్యార్థిని అంటే చదువు ఒకటే కాదని... భారతీయ సంస్కృతి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు

ABOUT THE AUTHOR

...view details