కరోనా లాక్‌డౌన్ సమయంలో అధికారులు పర్యవేక్షణకు వచ్చే అవకాశం లేదని భావించిన కొందరు అక్రమార్కులు... గ్రామాల్లో ఉపాధి పనుల్లో యంత్రాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. యంత్రాలతో పనులు చేయించి, వాటిని కూలీలు చేసినట్లు చూపి బిల్లులు చేసుకుంటున్నారని తెలిసింది. గత కొన్ని రోజులుగా సంజీవపురం గ్రామంలో పట్టపగలే యంత్రాలతో ఫారంపాండు గుంతలు తీస్తున్న దృశ్యాలను గ్రామస్థులు కొందరు సెల్‌ఫోనులో చిత్రీకరించి నేరుగా జేసీ గంగాధర గౌడ్‌కు పంపారు.
ఈ ఘటననపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీడీ నీలిమను ఆదేశించారు. ఎంపీడీవో తేజోత్స్నతో కలిసి.. క్షేత్రస్థాయిలో ఏపీడీ విచారణ జరిపారు. నివేదికను పీడీకి అందిస్తామని చెప్పారు. యంత్రాలతో పనులు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.