అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మండల సరిహద్దుల్లో ఉన్న వేదవతి నది నుంచి కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుమ్మగట్ట మండలానికి చెందిన 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ - jcb tractors seaz in ananthapuram
బ్రహ్మసముద్రంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సీజ్