ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోటీ లేకుండా గెలవాలనే రహస్య జీవోలు' - అనంతపురం జిల్లా గన్నివారిపల్లిలో మాజీ ఎంపీ జేసీ పర్యటన

గన్నివారిపల్లిలో మాజీ సర్పంచి చిబిలి వెంకటరమణను మాజీ ఎంపీ దివాకర్​రెడ్డి పరామర్శించారు. తెదేపా నాయకుల పోటీ చేయకూడదనే వైకాపా జీవోలు జారీ చేసిందని విమర్శించారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

By

Published : Mar 5, 2020, 8:52 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నివారిపల్లిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పర్యటించారు. గన్నివారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచి ఓ ఘర్షణ కేసులో అరెస్టై 60 రోజుల తర్వాత బెయిల్​పై విడుదలయ్యాడు. వెంకటరమణను జేసీ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ తీసుకొచ్చిన జీవో ద్వారా తెదేపా నాయకులెవ్వరు సర్పంచి, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనటం లేదన్నారు. తమపార్టీ నాయకులు స్వచ్ఛందంగా గెలిచిన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. పోటీ లేకుండా వైకాపా గెలివాలనే ఉద్దేశ్యంతోనే జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. జీవోల కారణంగా తెదేపా సర్పంచులకు లక్షల్లో నగదు మిగిలిందని వ్యాఖ్యానించారు. విశాఖలో తమ అధినాయకుడుని పోలీసులు అడ్డుకున్న సమయంలో సురక్షితంగా బయట పడినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామన్నారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details