ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేసీ ట్రావెల్స్​కు సంబంధించిన వాహనాలు సీజ్ - జేసీ ట్రావెల్స్ పై వార్తలు

జేసీ ట్రావెల్స్​కు సంబంధించిన నాలుగు టిప్పర్ వాహనాలను సీజ్ చేసినట్లు డీటీసీ శివరాంప్రసాద్ తెలిపారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి నడుపుతున్నట్లు నిర్థరణ కావడంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు.

news on jc travels
జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన వాహనాలు సీజ్

By

Published : Jun 2, 2020, 6:17 PM IST

Updated : Jun 2, 2020, 7:19 PM IST

అనంతపురం జిల్లాలో జేసీ ట్రావెల్స్​కు సంబంధించిన వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి నడుపుతున్నట్లు గుర్తించారు. వాటిని సీజ్ చేసినట్లు డీటీసీ శివరాంప్రసాద్ తెలిపారు.

గతంలో 57 వాహనాలు సీజ్ చేశామన్న డీటీసీ.. ఇవాళ 4 వాహనాలు పట్టుకున్నట్టు చెప్పారు. మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్టర్ చేసి జేసీ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు సమాచారం ఉందన్నారు. త్వరలో వీటన్నింటినీ సీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: ఈటీవీ భారత్ గ్రౌండ్​​ రిపోర్ట్​: 'కాలాపానీ'పై రగడ ఏల?

Last Updated : Jun 2, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details