అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్ సిరి ఆరా తీశారు. పనులపై గుత్తేదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల 50 శాతంపైగా పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించలేదని, ఇసుక కొరత, మరికొన్ని చోట్ల పోలీసు వేధింపుల నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతుందని గుత్తేదారులు జేసీకి వివరించారు.
సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.