మున్సిపల్ ఎన్నికలకు వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల్లో వాలంటీర్లను వైకాపా నేతలు కార్యకర్తల్లా వినియోగిస్తున్నారని ఆరోపించారు. 50 ఇళ్లకు ఒకరి చొప్పున ఉన్న వాలంటీర్లలో 90 శాతానికి పైగా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలేనని వ్యాఖ్యానించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో నామినేషన్లు వేయనీయకుండా వైకాపా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తెదేపా అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. అన్ని ఆధారాలు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమర్పించామని.. నామినేషన్ వేయటానికి అవకాశం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.