ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుర' బరిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడిపత్రి మున్సిపాలిటీ బరిలో ప్రభాకర్ రెడ్డి న్యూస్

అనంతపురం జిల్లాలో నగరపాలక సంస్థ, 8 పురపాలక సంఘాలు, 2 నగర పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి పురపాలక సంస్థలోని 30వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు.

'పుర' బరిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
'పుర' బరిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Mar 12, 2020, 11:46 PM IST

'పుర' బరిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి పురపాలక సంస్థలోని 30వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన నామినేషన్ పత్రాలను అనుచరుల ద్వారా దాఖలు చేయించారు. ఆయన ఈసారి తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు 144 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గుంతకల్లులో 55, గుత్తిలో 21, తాడిపత్రిలో 52, కళ్యాణదుర్గంలో 46, రాయదుర్గంలో 23, ధర్మవరంలో 73, హిందూపురంలో 48, కదిరిలో పురపాలక సంస్థలో 61 నామినేషన్లు దాఖలయ్యాయి.

పుట్టపర్తి నగర పంచాయతీలో 14 మంది నామినేషన్ వేయగా, మడకశిర నగర పంచాయతీ పరిధిలోని వార్డులకు రెండు రోజుల్లో ఒక్కరు కూడా దాఖలు చేయలేదు. అనంతపురం నగరపాలక సంస్థలో మేయర్ పదవి ఆశావహులు తెదేపా నుంచి మాజీ కార్పోరేటర్ లక్ష్మిరెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిలు కార్పొరేటర్లుగా నామినేషన్లు వేశారు. వైకాపాలో నగర మేయర్ ఆశావహుల్లో ఒకరైన చవ్వా రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్​గా నామపత్రాలు సమర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details