JC Prabhakar: ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్ ఓపెన్ చేసినా భయపడబోనని ... తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో చంద్రదండు ప్రకాష్ నాయుడును ఆయన కలిశారు. కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని నిరసనలు చేస్తే చంద్రదండు ప్రకాష్ నాయుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మరింత పని చేస్తానని చెప్పారు. చంద్రబాబు సీఎం అయినా తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.
చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్‌రెడ్డి - అనంతపురంలో చంద్రదండు ప్రకాష్ నాయుడును కలిసిన జేసీ
JC Prabhakar: చంద్రదండు ప్రకాష్ నాయుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్ ఓపెన్ చేసినా భయపడబోనని జేసీ స్పష్టం చేశారు. చంద్రబాబును సీఎం చేసిన తర్వాత.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
అనంతపురంలో చంద్రదండు ప్రకాష్ నాయుడును కలిసిన జేసీ