ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు సంక్షేమ సంఘం ఏం చేస్తోంది?

పోలీసు సంక్షేమ సంఘం తీరుపై తెలుగు దేశం నేత జేసీ ప్రభాకర్​ రెడ్డి మండిపడ్డారు. స్వయాన ఎమ్మెల్యే.. జిల్లా ఎస్పీని తిడితే ఏం చేశారంటూ పోలీసు సంక్షేమ సంఘాన్ని నిలదీశారు.

By

Published : Jan 20, 2021, 4:15 PM IST

jc prabhakar reddy
జేసీ ప్రభాకర్​ రెడ్డి

వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా ఎస్పీని తిడితే పోలీసు సంక్షేమ సంఘం ఏం చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పోలీస్‌ సంక్షేమ సంఘానికి పార్టీల పక్షపాతం ఎందుకని నిలదీశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటూ పోలీసుల పరువు తీయొద్దని.. సంఘానికి సూచించారు. రాష్ట్రంలోని పోలీసులు ఇప్పటికైనా మారండంటూ హితువు పలికారు.

ABOUT THE AUTHOR

...view details