JC Prabhakar Fires on Dharmavaram MLA: గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలతో క్షణక్షణం రణరంగంగా మారుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నాయకుడు, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పేద రైతులకు అందాల్సిన పంటల బీమా కాజేశారని పలు ఆరోపణలు చేసిన జేసీ.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనని చెప్పుతో కొడతాననడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నించిన తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మీడియా సమావేశం పెట్టి బాబాయ్, కొడుకుపై ధ్వజమెత్తారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి సైతం సవాల్ విసిరారు.
JC Prabhakar Amgry: "ఎమ్మెల్యే పదవి లేకుంటే ఆ దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న పోతారు" - ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
JC Prabhakar Fires on Dharmavaram MLA: పేద రైతులకు అందాల్సిన పంటల బీమాను కాజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ప్రశ్నించిన తనను చెప్పుతో కొడతానని అనటం ఏంటని.. తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై జేసీ ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో జేసీ మాట్లాడుతూ.."ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నీ కుటుంబం ఎలా బతికిందో నేను చెబుతాను రా. చెప్పుతో కొడుదువు. మీ కుటుంబాలు ఎలా బతికాయో చెబుతాను, ఆధారాలతో చూపిస్తాను. మీ తాత చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం కూడా లేని మీరు నన్ను చెప్పుతో కొడతారా. చల్లా సుబ్బరాయుడు సహాయం చేయకపోతే మీ తాత శవాన్ని తీసుకెళ్లలేని వాళ్లు మీరు. మీ చిన్నాన్న పేదలకు దక్కాల్సిన పంటల బీమాను అక్రమంగా కాజేసీ.. లక్షల రూపాయలు కొట్టేశాడు. ఆయన్ని చెప్పుతో కొట్టుపో. లండన్‌లో ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేసిన నీవు, ఇక్కడ గొప్పలు చెబుతున్నావా. 1969లోనే మీ నాన్నను మేము ఫియట్ కార్లో తిప్పాం. నీ కుటుంబం గురించి తెలుసుకో. 80 సంవత్సరాలు పైబడిన మా అక్కను ఐదేళ్లుగా ఇంట్లో ఉంచుకొని సపర్యలు చేస్తున్నాం. కానీ మీరు, మీ పెద్దలను పశువుల పాకలో పడేసిన విషయం గుర్తుచేసుకో. ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు. చెప్పుతో కొడుతావా... కొట్టురా చూద్దాం... మీ తాత చనిపోతే పోలేకపోయారు. పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా. మీ నాన్నను చంపిన వాళ్లతో ఎందుకు రాజీ అయ్యారు. మీరు నన్ను కొడతారేమో కానీ.. ప్రజలు మాత్రం మిమ్మల్ని చెప్పుతో కొడతారు. మీ మాదిరిగా దౌర్జన్యాలు చేయడం, దోచుకోవడం నాకు రాదు" అంటూ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై జేసీ తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే అక్రమాలు చాలా ఉన్నాయన్నారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని.. తాను ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని జేసీ స్పష్టం చేశారు.