ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JC: 'తండ్రిని తిడుతున్నా.. సీఎం జగన్ స్పందించరా?' - జగన్​పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

తండ్రి వైఎస్సార్​ను తెలంగాణ మంత్రులు తిడుతున్నా.. జగన్ స్పందించకపోవటం చూస్తుంటే హైదరాబాద్​లో నివాసాలున్న తమలాంటి వారికి భయమేస్తోందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ అని పార్టీ పెట్టుకున్న జగన్.. తన తండ్రి ఫోటో కూడా కనిపించకుండా చేశారని ఆగ్రహించారు.

jc prabhakar reddy
jc prabhakar reddy

By

Published : Jul 5, 2021, 8:28 PM IST

జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు తిడుతుంటే.. సీఎం జగన్ నోరు విప్పలేని స్థితిలో ఉన్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్ని మాటలంటున్నా.. మంత్రులెందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పారు.

తండ్రిని తిడుతున్నా జగన్ స్పందించకపోవటం చూస్తుంటే..హైదరాబాద్​లో నివాసాలున్న తమలాంటి వారికి భయం వేస్తోందని అన్నారు. వైఎస్సార్ అని పార్టీ పెట్టుకున్న జగన్..తన తండ్రి ఫొటో కూడా కనిపించకుండా చేశారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details